‘వాలా 2’ అందరికీ కనెక్ట్ అవుతుంది: సాయిదుర్గా తేజ్


హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు దక్షిణాది భాషల సినిమాలను చాలా వరకు ఆదిరిస్తారు. తమిళ, మలయాళ, కన్నడ అనువాద చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. అదే మాదిరి ‘వాలా 2’ హిట్టయ్యిందని అంటున్నారు హీరో సాయిదుర్గా తేజ్. హషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్ ప్రధాన పాత్రధారులుగా సావిన్ ఎసఏ తెరకెక్కించిన మలయాళ చిత్రాన్ని ‘వాలా 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నిర్మాత సాహు గారపాటి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ ఏర్పాటు చేశారు. కథానాయకులు సాయి దుర్గా తేజ్, నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సాయిదుర్గా తేజ్ మాట్లాడుతూ…‘తెలుగు వాళ్లది మంచి మనసు. అన్ని సినిమాల్ని చూస్తారు. అందర్నీ స్వాగతిస్తారు. ఇప్ప్పుడీ ‘వాలా 2’ని గొప్పగా ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రతిఒక్కరికీ తమ జీవితాల్లోని ఏదోక దశతో కనెక్ట్ అయ్యేలా ఉంటుందన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ… ‘ఈ చిత్రానికి చాలాచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయని విన్నా. ఆనందంగా అనిపించింది. ఇది ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సినిమా. తెరపై కనిపించిన ప్రతి పాత్రా నన్నెంతో ఆకట్టుకుంది. అప్పట్లో నా ‘హ్యాపీడేస’ కూడా మలయాళంలో మంచి ఆదరణని దక్కించుకుంది. అది ఇంజినీరింగ్ బయోపిక్ అయితే… ఈ ‘వాలా 2’ బిలియన్ బ్రోస్ బయోపిక’ అని అన్నారు. ఒక భాషకి గౌరవమిచ్చి సరిగ్గా అనువదిస్తే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఈ విషయంలో ‘వాలా 2’ తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. నేనైతే ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకున్నానన్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *