CCTV Installation Course: ఫ్రీగా CCTV ఇన్‌స్టాలేషన్ మెయింటెనెన్స్ కోర్సు.. కెరియర్ సెట్ అయ్యే జాబ్, బిజినెస్‌ ఛాన్స్ | జాబ్స్ & ఎడ్యుకేషన్


Last Updated:

CCTV Installation Course: ప్రస్తుత కాలంలో భద్రత పర్యవేక్షణ కోసం CCTV (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరాలు ఒక విలాసం కోసం కాదు. అది ఒక కనీస అవసరంగా మారిపోయాయి. నగరాల్లోనే కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి వినియోగం పెరగడంతో సీసీటీవీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందులే CCTV కెమెరా ఇన్‌స్టాలేషన్ మెయింటెనెన్స్ కోర్సును ఉచితంగా అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగఅవకాశాల కల్పనకు మార్గం చూపిస్తోంది కెనరా బ్యాంక్.

సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ కోర్సులో ఉచిత శిక్షణ...
సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ కోర్సులో ఉచిత శిక్షణ…

CCTV Installation Course: ప్రస్తుత కాలంలో భద్రత పర్యవేక్షణ కోసం CCTV (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరాలు ఒక విలాసం కోసం కాదు. అది ఒక కనీస అవసరంగా మారిపోయాయి. నగరాల్లోనే కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి వినియోగం పెరగడంతో సీసీటీవీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందులే CCTV కెమెరా ఇన్‌స్టాలేషన్ మెయింటెనెన్స్ కోర్సును ఉచితంగా అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగఅవకాశాల కల్పనకు మార్గం చూపించాలని  కెనరా బ్యాంక్ భావించింది. ఇందులో భాగంగానే కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో ఈ కోర్సు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా భోజనం వసతి సదుపాయం కల్పిస్తూ నేర్పిస్తున్నారు. అయితే వయసు 19- 50 మధ్య ఉండే వారికి బ్యాచ్‌లుగా ట్రైనింగ్ సెషన్స్ మొదలుపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

ఫ్రీ ట్రైనింగ్..

సీసీటీవీ కెమెరా కోర్సు అంటే ఇన్‌స్టాలేషన్‌తో పాటు మెయింటెనెన్స్ నేర్చుకోవడం వల్ల ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో అనేక ఉపయోగాలు ఉన్నాయి.స్వయం ఉపాధి వ్యాపార అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీరు సొంతంగా “సెక్యూరిటీ సిస్టమ్స్” షాపును ప్రారంభించవచ్చు. ఇళ్లకు, ఆఫీసులకు కెమెరాలు అమర్చడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. కేవలం ఇన్‌స్టాలేషన్ మాత్రమే కాకుండా పాడైపోయిన కెమెరాలను బాగు చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.

ఉపాధితో పాటు ఉద్యోగావకాశాలు..

పెద్ద పెద్ద కంపెనీలు, మాల్స్, బ్యాంకులు అపార్ట్‌మెంట్లలో CCTV టెక్నీషియన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సెక్యూరిటీ ఏజెన్సీలలో ‘సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్’గా లేదా ‘టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్’గా చేరవచ్చు. నైపుణ్యం సాంకేతిక పరిజ్ఞానం నెట్‌వర్కింగ్ పరిజ్ఞానం కెమెరాలను ఇంటర్నెట్‌కు ఎలా అనుసంధానించాలి, మొబైల్‌లో లైవ్ ఫుటేజీని ఎలా చూడాలి అనే సాంకేతిక విషయాలపై పట్టు వస్తుంది.

డిమాండ్ కలిగిన ప్రొఫెషన్..

వైరింగ్ హార్డ్‌వేర్ వివిధ రకాల కేబుల్స్ (CAT6, Coaxial), DVR/NVR కాన్ఫిగరేషన్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ గురించి అవగాహన పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఈ కోర్సు చేయడానికి ఎక్కువ కాలం పట్టదు (సాధారణంగా 1 నుండి 3 నెలలు పడుతుంది అయితే కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పుట్టపర్తిలో కేవలం 13 రోజులలో ఈ కోర్సు నేర్పిస్తున్నారు ఉచిత భోజనం వసతి తో పాటు ). తక్కువ పెట్టుబడితో ఎక్కువ నైపుణ్యం సంపాదించి, మార్కెట్లో త్వరగా స్థిరపడవచ్చు.సామాజిక భద్రతలో భాగస్వామ్యం నేరాల నియంత్రణలో పబ్లిక్ సేఫ్టీలో టెక్నీషియన్ల పాత్ర చాలా కీలకం. సరైన చోట కెమెరాలను అమర్చడం ద్వారా మీరు పరోక్షంగా సమాజ రక్షణకు సహాయపడతారు.

CCTV కెమెరాల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు..

నేరాల నియంత్రణ కెమెరాలు ఉన్నాయని తెలియగానే దొంగతనాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు భయపడతారు. ఇది నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో మొదటి అడుగుగా పనిచేస్తుంది.లైవ్ మానిటరింగ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో, మనం ఎక్కడ ఉన్నా సరే మొబైల్ ఫోన్ ద్వారా మన ఇల్లు, ఆఫీసు లేదా వ్యాపార సంస్థను నిరంతరం పర్యవేక్షించవచ్చు. ముఖ్యంగా యజమానులు అందుబాటులో లేని సమయంలో ఇది చాలా ఉపయోగకరం.

కెరియర్‌కి ఇదే చక్కని మార్గం..

సాక్ష్యాధారాల సేకరణ ఏదైనా దురదృష్టవశాత్తూ సంఘటన జరిగినప్పుడు దోషులను పట్టుకోవడానికి CCTV ఫుటేజ్ తిరుగులేని సాక్ష్యంగా మారుతుంది. ఇది పోలీసు విచారణలో చట్టపరమైన సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉత్పాదకత  క్రమశిక్షణ కార్యాలయాలు లేదా వ్యాపార సంస్థలలో కెమెరాలు ఉండటం వల్ల సిబ్బంది పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, పని ప్రదేశంలో భద్రతా నియమాలు సరిగ్గా పాటిస్తున్నారో లేదో కూడా గమనించవచ్చు. మహిళలు పిల్లల భద్రత ఇంట్లో పిల్లలు లేదా వృద్ధులు ఉన్నప్పుడు, వారు క్షేమంగా ఉన్నారా లేదా అని చూసుకోవడానికి ఈ కెమెరాలు ఎంతో భరోసాను ఇస్తాయి. వివరాలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సెల్ :8500677585,9705091727 నంబర్లకు కాల్ చేసి వివరాలు పొందవచ్చు. అడ్మిషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *