Snake Viral Video: టీచర్ ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. మంచినీళ్లిచ్చి మర్యాద చేసి పంపారు, వీడియో ఇదిగో | ట్రెండింగ్


Last Updated:

Snake Viral Video: మోత మోగిస్తున్న ఎండలు తట్టుకోలేక ఓ విషసర్పం ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడింది. మానవత్వం తట్టి లేపే ఆ మాస్టారు విషసర్పానికి మంచినీళ్లు పోసి ఆదరించారు.

+

Snake

Snake Viral Video

Viral Video: ఎండలు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలే కాదు సకల జీవరాసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మనుషులు అయితే వేసవి తాపాన్ని తట్టుకోలేక ఏసీ లేదా ఫ్యాన్ వంటి వాటి కింద సేద తీర్చుకుంటున్నారు. మరి అడవుల్లో , పుట్టల్లో తుప్పల్లో ఉండే వన్యప్రాణులు, క్రూరమృగాలు, పాములు సైతం దాహార్తిని తీర్చుకోవడానికో లేదంటే వేసవి నుంచి కాస్త రిలాక్స్ అవడానికో జనావాసాల మధ్యకు వస్తున్నాయి. మోత మోగిస్తున్న ఎండలు తట్టుకోలేక ఓ విషసర్పం ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడింది. మానవత్వం తట్టి లేపే ఆ మాస్టారు విషసర్పానికి మంచినీళ్లు పోసి ఆదరించారు. గొంతెండిపోయిన పాముకి నీళ్లిచ్చి చల్లబరచడమే కాకుండా దాన్ని భద్రంగా తీసుకెళ్లి మనుషులు ఎవరూ దాడి చేసి చంపకుండా ఉండేలా అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇలాంటి అద్భుతమైన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చింతల గ్రామంలో చోటుచేసుకుంది.

సమ్మర్ ఎఫెక్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోవడంతో జనం బయట తిరగడానికే జంకుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంగా చెప్పబడే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చింతల గ్రామంలో ఒక ఉపాధ్యాయుడి నివాసంలోకి భారీ తాచుపాము చొరబడింది. విష సర్పం వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇంట్లోకి చొరబడ్డ పాము పడగవిప్పి బుసలు కొట్టింది. పాము పడగవిప్పినప్పుడు పడగపై ప్రత్యేక రూపం సైతం ఆకర్షణీయంగా కనిపించింది. పాము ఇంట్లోకి వచ్చిన విషయాన్ని గమనించిన టీచర్ కుటుంబ సభ్యులు వెంటనే కోనసీమ జిల్లాకు సంబంధించిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం చేరవేశారు.

ఇంట్లోకి వచ్చి నీళ్లు తాగింది..

పాము చొరబడిన ఇంటికి హుటాహుటిన వచ్చిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ పామును బంధించే ప్రయత్నం చేశారు. అయితే అది ఇంట్లోకి ఎందుకొచ్చిందో గమనించిన స్నేక్ క్యాచర్ ముందుగా దాని అవసరాన్ని తీర్చాడు. వాటర్ బాటిల్‌తో నీళ్లు తెప్పించి పాముకి పట్టించాడు. అనంతరం ఆ పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఏది ఏమైనా మనుషులతో సమానంగా జీవరాసులను సైతం చూస్తున్న స్నేక్ క్యాచర్ పాముకి నీళ్లు పట్టడం చూసి స్థానికులు అభినందిస్తున్నారు.

పాములను కొట్టకండి.. జాగ్రత్త..

ఇదే సమయంలో పాము ఇంట్లోకి రావడానికి గల కారణాలను కూడా చెప్పారు. ముఖ్యంగా చెరువులు సైతం ఎండిపోవడంతో నీళ్లు తాగేందుకు పాములు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని స్నేక్యాచార్ పేర్కొన్నారు. పెరుగుతున్న ఎండల వల్లే ఈ పాము కూడా వచ్చి ఉండవచ్చని వాటి నుండి జాగ్రత్తలు వహిస్తూనే వాటికి ఇబ్బందులు పెట్టకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. ఏది ఏమైనా విషం చిమ్మే పాముని సంరక్షించడమే కాకుండా దాని దాహం తీర్చి సురక్షిత ప్రాంతంలో వదిలేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *