కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం కింద రూ.1805.24 కోట్లను విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. గ్రామాల్లో పనులు చేసే కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించేందుకు ఈ మనీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పేదలు, అర్హులైన వారికి ఈ డబ్బుతో ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. ఇక ఏపీలో ఉపాధి హామీ పనులు పెరిగే, జోరందుకునే వీలుంది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని.. ఉపాధి పొందడం ద్వారా తమ జీవితాల్ని మెరుగుపరచుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.


