Last Updated:
అనంతపురం జిల్లాలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు RUDSET ద్వారా ఉచిత ట్యాలీ శిక్షణ భోజనం వసతి, ఏప్రిల్ 17 నుంచి జూన్ 22 వరకు, వయస్సు 19 నుంచి 50, పదో తరగతి అర్హత
అనంతపురం జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ మహిళలకు అద్భుతమైన అవకాశం గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (RUDSET) ఆధ్వర్యంలో ఉచిత ట్యాలీ శిక్షణ, భోజనం, వసతి పూర్తిగా ఉచితం వయస్సు 19-50 సంవత్సరాల మధ్య ఉండాలి ఏప్రిల్ 17 నుంచి జూన్ 22 వరకు శిక్షణ తరగతులు జరుగుతాయి.
గ్రామీణ పట్టణ సాధారణ గృహిణి మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ట్యాలీ ఒక అద్భుతమైన కోర్స్. ముఖ్యంగా అకౌంటింగ్, ఫైనాన్స్ డేటా ఎంట్రీ రంగాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కోర్సులో నేర్చుకునే ముఖ్యాంశాలు అకౌంటింగ్ సూత్రాలు నిబంధనలు. స్టాక్ వివరాలను నమోదు చేయడం జీఎస్టీ ఇన్ వాయిస్లు రిటర్న్స్ దాఖలు చేయడం. ఉద్యోగుల జీతభత్యాల నిర్వహణ. బ్యాంక్ రీకాన్సిలియేషన్ ఇతర పన్నుల వివరాలు ఇలాంటివి .
కెరీర్ అవకాశాలు.. ట్యాలీ పూర్తి చేసిన మహిళలకు ఈ కింది విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అకౌంటెంట్, ప్రైవేట్ కంపెనీలు లేదా మాల్స్‌లో. డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో పని చేయవచ్చు. జీఎస్టీ కన్సల్టెంట్ చిన్న వ్యాపారస్తులకు ట్యాక్స్ ఫైలింగ్ చేయడంలో సహాయపడవచ్చు. స్వయం ఉపాధి ఇంటి నుంచే ఫ్రీలాన్స్ అకౌంటింగ్ పనులు చేసుకోవచ్చు.
అర్హతలు కనీసం పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి (కామర్స్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే మరింత సులభం). వ్యవధి సాధారణంగా 1 నుంచి 2 నెలల కోర్స్ ఉంటుంది. ఉచిత శిక్షణ పొందే మార్గాలు (ప్రభుత్వ పథకాలు) మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కొన్ని సంస్థలు ఉచితంగా ట్యాలీ శిక్షణను అందిస్తున్నాయి.
RUDSET అనంతపురం వంటి ప్రాంతాల్లో గ్రామీణ నిరుద్యోగ యువతుల కోసం ఉచితంగా కంప్యూటర్ అకౌంటింగ్ (Tally) శిక్షణ ఇస్తున్న అనంతపురం జిల్లా గ్రామీణ యువతకి అద్భుత అవకాశాలు అందిస్తోంది రూట్ సెట్ సంస్థ. వీరు ఉచిత భోజనం వసతి కల్పిస్తారు. మరన్ని వివరాలకు SK స్టేడియం పక్కన, ఆకుతోట పల్లి, అనంతపురం జిల్లా. 94927 63484, 96188 76060 నంబర్లు సంప్రదించండి..
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



