Thotapalli: ప్రకృతి మధ్యలో కొత్త టూరిస్ట్ స్పాట్.. తోటపల్లి ఐటీడీఏ పార్క్‌కు జనం క్యూ..! totapalli itda park emerging as new tourist hub. |


Last Updated:

తోటపల్లి ఐటీడీఏ పార్క్ పర్యాటకుల హాట్ స్పాట్, బోటింగ్, వెదురు సెల్ఫీ స్పాట్స్, వ్యాయామ పరికరాలు, పిల్లల ప్లే ఏరియాతో వీకెండ్స్‌లో సందర్శకులతో కిక్కిరిసిపోతోంది

+

కొత్త

కొత్త హంగులతో  ఐటిడిఐ పార్క్ అందాలు

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటైన ఐటీడీఏ పార్క్ ఇప్పుడు పర్యాటకుల హాట్ స్పాట్‌గా మారింది. ప్రకృతి అందాలు, ఆధునిక సదుపాయాలు కలిసిన ఈ ప్రదేశం కుటుంబాలు, యువతకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పచ్చని చెట్లు, శుభ్రమైన వాతావరణం, చల్లని గాలులతో సందర్శకులు ఇక్కడికి అడుగుపెడితే చాలు ఒక ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. సమీపంలోనే విరాజిల్లుతున్న తోటపల్లి బ్యారేజ్ రిజర్వాయర్ అందాలు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని జోడిస్తున్నాయి.

ప్రత్యేకంగా ఇక్కడ అందుబాటులో ఉన్న బోటింగ్ సదుపాయం సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి పడవలో విహరించే క్షణాలు సందర్శకులకు మధురమైన జ్ఞాపకాలను అందిస్తున్నాయి. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులతో పార్క్ మరింత ఆకర్షణీయంగా మారింది. వెదురుతో తయారు చేసిన ఉయ్యాలలు చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి మధ్యలో ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేయడానికి సందర్శకులు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు.

యువత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెదురు సెల్ఫీ స్పాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అందమైన బ్యాక్‌గ్రౌండ్‌తో ఫోటోలు దిగేందుకు యువత పోటీ పడుతోంది. అదే సమయంలో పార్క్‌లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు కూడా ప్రధాన ఆకర్షణగా మారాయి. పోలీస్, ఆర్మీ శిక్షణను తలపించే ఈ ఎక్సర్సైజ్ ఎక్విప్‌మెంట్స్ యువతను ఆకర్షిస్తున్నాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టిన యువకులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడికి వచ్చి వ్యాయామం చేస్తున్నారు.

పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లే ఏరియా కుటుంబాలను మరింత ఆకర్షిస్తోంది. పిల్లలు సురక్షితంగా ఆటలలో మునిగితేలుతుండగా, పెద్దలు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ పార్క్ సందర్శకులతో కిక్కిరిసిపోతుంది. సమీప ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. బోటింగ్, సెల్ఫీ స్పాట్స్, వ్యాయామ సదుపాయాలు, శుభ్రమైన వాతావరణం ఇలా అన్ని అనుభవాన్ని అందిస్తున్న ఈ తోటపల్లి ఐటీడీఏ పార్క్, పర్యాటక అభివృద్ధికి కొత్త గుర్తింపుగా మారుతోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో భవిష్యత్తులో ఇది మరింత పెద్ద టూరిస్ట్ హబ్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *