పేదల కడుపుకొడితే సహిస్తారా? – Visalaandhra


గ్రామీణ ప్రాంత ప్రజానీకం జీవనాడి అయిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎనఆర్‌ఈజీఏ) బలోపేతం చేయడంలో ఘోరంగా విఫలమైన మోదీ ప్రభుత్వం, దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్‌గార్ అజీవికా మిషన్ (జి రామ్ జి) ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి ఉసురు తీసింది. నిస్సిగ్గుగా చేపట్టిన ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల హననమే. కొత్త చట్టం ఉత్తుత్తి చట్టమేమీ కాదు. హక్కులపై ఓ బుల్డోజర్. మహాత్మాగాంధీ పేరు ఉండడమే ఈ చట్టం రద్దుక— కారణమైంది. ఇక ప్రభుత్వాల దయతో పని హక—్కను పొందడం అంటే పేదలక— ఆకలి చావులు, పస్తులు కొని తెచ్చుకోవడమే. పాత రోజులు గుర్తుక— తెచ్చే ‘జీ రామ్ జీ్ణ చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యథావిధిగా కొనసాగించాలని దేశంలో మొట్టమొదట ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన బండ్లపల్లె గ్రామం వరక— భారత కవ¶్యనిస్టు పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్ర చేపట్టాయి. ఆరంభం పాదయాత్ర అనుకున్నా, ఆఖరికొచ్చేసరికి అది ‘మహా పాదయాత్ర్ణగా మారింది. వ్యవసాయ కూలీలు, పేదలు, దళితులు, గిరిజనులు, చేతివృత్తిదారులు, కౌలు రైతులు అత్యధికంగా పాల్గొనడం విశేషం. ఏప్రిల్ 10న అనంతపురంలోని సమతాగ్రామ్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్ర 12వ తేదీ వరక— కొనసాగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పాదయాత్ర సాంతం పాల్గొని వ్యవసాయ కార్మికుల ఉద్యమానికి స్ఫూర్తినింపారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, బీకేఎంయూ జాతీయ నాయకులు గుల్జార్‌సింగ్‌ గోరియా, నిర్మల్ పాండే ముగింపు కార్యక్రమానికి వచ్చి, తుదివచనాలు పలకడంతో ఇది జాతీయ ఉద్యమంగా మారే అవకాశాలపై ఆశలుపోశాయి.
కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గ్రామీణ పేద కూలీలక—, చిన్న, సన్నకారు రైతులక— అండగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం ఉపాధిపై అనూహ్యమైన వేటు. ‘నరేగా్ణ స్థానంలో bలాంటి హక—్కలు లేని ‘వీబీ జీ రామ్‌జీ్ణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా bంజీbనఆరఈజీఏ ద్వారా ఇప్పటివరక— హక—్కగా పొందుతున్న ఉపాధిని గ్రామీణ పేదలు కోల్పోయే పరిస్థితులు దాపురించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామీణ కూలీలు ఉపాధిని హక—్కగా అనుభవించారు. వామపక్షాల పోరాట ఫలితమది. ఏమాటకామాట అది యూపీఏ ప్రభుత్వ ఘనతే. bందుకంటే ఈ పథకాన్ని తీసుకువచ్చింది మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వమే. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసానిచ్చిన ఈ పథకాన్ని మోదీ సర్కారు ఒక కలంపోటుతో, పార్లమెంటులో మందిబలంతో తుంచేసి, వ్యవసాయ కార్మికునికి మహాద్రోహం చేసింది. ఆనాడు ఏయే గ్రామాల్లో పనులు కల్పించాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిక—ండేది. అయితే వీబీ జీరామ్‌జీ ద్వారా నేడు ఆ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుక—న్నది. అలాగే గతంలో కేంద్రం 90శాతం నిధులు కేటాయిస్తుండగా, 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేది. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదమున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విముఖత ప్రదర్శించి..అన్నంత పనీ చేశాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేసిన తర్వాత వలసలు తగ్గి, గ్రామీణ పేదల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిన విషయాన్ని అందరూ గుర్తించారు. అందుకే ఆ పథకానికి అంతగా ప్రాచుర్యం దక్కింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్లక— ఊడిగం చేస్తూ వారి ఆస్తులు పెంచుతూ, మరోవైపు చట్టాలు మార్చి పేదల కడుపు కొట్టడానికి పూనుకోవడం దురదృష్టకరం, దేశానికి పట్టిన దరిద్రం. గత పన్నెండేళ్ళ మోదీ పాలనలో రైతాంగానికి చేసిందేమీ లేదనేది సర్వవిదితం. సంవత్సరానికి 6 వేల రూపాయలు రైతుల ఖాతాకు జమచేస్తూ వారిని పింఛనుదారుల కంటే హీనంగా పరిగణిస్తున్నారు. రైతులను అప్ప్పుల నుండి విముక్తి చేయడానికి, రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వాలు పనిచేయడం లేదనడానికి ఇదొక నిదర్శనం. ఐదేళ్ళకొకసారి ప్రభుత్వాలు మారినా గ్రామీణ ప్రజల బాధలు తగ్గడం లేదు. డా॥ ఎం.ఎస్.స్వామినాథన్ సిఫార్సులపై ఉపన్యాసాలు తప్ప అమలు గురించి ఆలోచించడం లేదు. ఇవన్నీ చాలదన్నట్లు, చివరక— కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో అధికారానికొచ్చిన యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సైతం తిలోదకాలివ్వడం దారుణం. గ్రామీణ భారతదేశాన్ని కష్టాల ఊబిలోకి నెట్టేయాలన్న మోదీ పన్నాగం పల్లెజనం పసిగట్టకుండా ఉండబోరు, ఈ అన్యాయంపై మౌనంగా ఉంటారనీ అనుకోలేం. అనంతపురం ప్రదర్శన ఇందుకొక ఉదాహరణ. వీబీ రామ్‌జీ పథకంపై ప్రజల వ్యతిరేకతకు ఇది అద్దం పడుతున్నది. ఇదంతా ఒకెత్తయితే, ఉపాధి హామీ పథకాన్ని మార్చివేసి కొత్త పథకానికి ఆమోదించిన ఫలితంగా మన రాష్ట్రంపైనా ప్రభావం మొదలైంది. దీని వల్ల రాష్ట్రంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. గోక—లం షెడ్లు నిర్మించుక—న్న వారికి చెల్లించాల్సిన 300 కోట్ల రూపాయలు నిలిచిపోయాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాల్సిన పరిస్థితులు ఏర్పడటం శోచనీయం. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో రాబోయే రోజుల్లో పనులు చేయించడం కచ్చితంగా ఇబ్బందికరం. దీనిని అడ్డంపెట్టుకొని, అనేక జిల్లాల్లో పనులు పూర్తి స్థాయిలో నిలిపివేయడానికి ఇప్పటికే క—ట్రలు మొదలయ్యాయి.
కొత్త పథకం అమలు వలన రాబోయే కాలంలో గ్రామాల నుండి పట్టణాలక—, నగరాలక— వలసలు విపరీతంగా పెరిగే ప్రమాదమున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఎంత కష్టమైనవో ఆ పథకంతో క్షేత్రస్థాయి పరిచయమున్న ఎవరికైనా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంత శ్రామిక—ల్లో 50 శాతానికిపైగా ఉపాధి హామీ పనులక— వస్తున్నారంటే, వ్యవసాయ రంగం bంత తీవ్రమైన సంక్షోభంలో ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కొత్త చట్టంలో ఈ వర్గాల ప్రజానీకం సమస్యల పరిష్కారం కోసం నెలకొల్పిన కౌన్సిళ్ళను సైతం రద్దు చేయడం నోటికాడ ముద్ద లాగేసుకోవడమే.2014లో మోదీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి ఏయేటికాయేడాది ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులో కోత పెడుతూ వచ్చారు. అదే సమయంలో కార్పొరేట్ వర్గాలక— పన్ను రాయితీలు, రుణ బకాయిల రద్దు పేరిట లక్షల కోట్ల రూపాయలు విచ్ఛలవిడిగా పోశారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించే నాటికి సుమారు 2 కోట్ల మందిగా వున్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 20 కోట్లక— చేరుక—న్నది. చట్టంలో నిర్దేశించినట్లు 100 రోజుల ఉపాధి కల్పన ఆచరణలో 50 రోజులకే పరిమితం అయింది. కానీ కొత్త చట్టంలో 125 పనిదినాలు కల్పిస్తామని పేర్కొనడం, పనిదినాలు పెంచామని డాంబికాలు పలకడం..రోజువారీ వేతనం 270 నుండి 240 రూపాయలక— తగ్గించడం.. పుండుమీద కారం చల్లి భ్రమలు కల్పించడమే. ఇన్ని కోట్లమంది ఉపాధి హామీ పనుల కోసం వస్తున్నారంటే దానికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో వేరే పనులు దొరకకపోవడమే. ఈ రకంగా పేదల కడుపుకొట్టే చట్టాలు చేస్తే జనం సహిస్తారా? గ్రామీణ ప్రాంత ప్రజానీకం ఎదుర్కొంటున్న గత్యంతరంలేని పరిస్థితుల నేపథ్యంలో వీబీ రామ్‌జీ పథకాన్ని ప్రతిఘటిస్తూ, అనంతపురంలో చేపట్టిన పేదయాత్ర దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహమూలేదు. దీనికి సీపీఐ, బీకేఎంయూ నేతృత్వం వహించి, ముందుకు నడిపిస్తాయని ఆశిద్దాం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *