Borewell Scam: మాయమైన ‘టెక్స్మో’ మోటార్లు.. బయటపడ్డ నిజాలు! వైకాపా నేతల అక్రమాలను ఎండగడుతున్న కూటమి నాయకులు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

బైరెడ్డిపల్లి మండలంలో త్రాగునీటి బోర్లకు తెదేపా కాలంలో వేసిన కంపెనీ పరికరాలు వైకాపా పాలనలో లోకల్ వాటితో మార్చి స్కామ్ చేశారని కూటమీ ఆరోపణ, ప్రజలు ఆగ్రహం

+

గ్రామాల్లో

గ్రామాల్లో అభివృద్ధి బాట పట్టిన కూటమీ నాయకులకు షాక్

అధికారం అనేది శాశ్వతం కాదు. నాయకులు అనే వారు శాశ్వతం కారు. కానీ మనం చేసే మంచి పనులనే భవిష్యత్తులో అందరూ గుర్తు పెట్టుకుంటారు. అది చిన్న పనైనా, పెద్ద పనైనా గుర్తుండి పోవాలి అంటే నాయకుడు లక్ష్యం ఒక్కటే గ్రామాల్లో అన్ని వర్గాలకు భేదాభిప్రాయాలు లేకుండా మంచి చేయడమే ధ్యేయంగా కొనసాగించాలి. అప్పుడే ఎన్నటికి స్థిర స్థాయిగా గుర్తుండిపోతారు.

ఇలాంటి క్రమాన్ని అనుసరించి 2014 నుంచి 2019 కి మధ్య తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండకూడదని. ఇంటింటా మంచి నీరు అందిచాలానే క్రమంలో బైరెడ్డిపల్లి మండల నాయకులు, కార్యకర్తలు ఆలోచించి గ్రామాల్లో బోర్లు వేశారు. పుష్కలంగా నీరు వచ్చిన చోట టెక్స్మో మోటర్లు, కంపిణీ కేబుల్స్, పైప్స్, మోటర్లు, స్టాటర్లు వేసి గ్రామాలకు నీళ్ళు అందించారు. కానీ ప్రభుత్వం మారడంతో అప్పుడు వేసిన వస్తూ సామగ్రి నేడు కనిపించలేదు. ఒక్క చోటే ఇలా జరిగిందా అని ఆలోచిస్తే నాడు వేసిన ప్రతి చోట వాటి స్థానంలో లోకల్ వేసి వాటిని తీసుకెళ్లి పోయారని నాయకులు ప్రజల ముందు వాస్తవాలు తెలిపే క్రమం చేశారు.

వాస్తవాలు తెలుసుకొన్న ప్రజలు వైకాపా ప్రభుత్వం పై గుర్రుమని ఉన్నారు.. ఎందుకంటే వైకాపా ప్రభుత్వంలో కంపెనీ వస్తువులను మోసేయడంతో నేడు తరుచుగా మరమ్మతులకు గురవుతున్నాయని ప్రజలు మండి పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నది. నాసిరకం వస్తువులు వినియోగించడంతో నీటి ఎద్దడి సమస్యగా మారిందని కూటమీ నాయకులు చెప్పుకొంటున్నారు. దీనిపై లోకల్ 18 బైరెడ్డిపల్లి పంచాయితీ రాజ్ శాఖ సిబ్బందిని వివరణ కోరగా మా దృష్టికి గ్రామాల నుంచి ఫిర్యాదులు అందాయి. వారిపై కఠిన మైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వేసవి వస్తే చాలు గ్రామాల్లో త్రాగునీటి సమస్య అను నిత్యం ఎదురు పడుతుంది. కాల కృత్యాల నుంచి మూగ జీవాల పెంపకం వరకు నీరు అనేది అను నిత్యం అవసరమే వీటిని అధికమించడానికి గ్రామాల బాట పట్టిన కూటమీ నాయకులకు అవాక్ అయ్యే సంఘటన ఎదురు పడింది. 2018 నుంచి 2019 మధ్య పీరియడ్ లో బైరెడ్డిపల్లి మండలంలోని కొన్ని పంచాయితీల్లో త్రాగునీటి కోసం బోర్ వేసి కావాల్సిన క్వాలిటీ పరికరాలు తెదేపా ప్రభుత్వం సమకూరిస్తే ప్రభుత్వం మారిన వెంటనే వాటి స్థలంలో వైకాపా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో లోకల్ బోర్ మోటర్లు, క్వాలిటీ కేబుల్స్, కంపెనీ స్టాటర్లు, బోర్ పైప్స్ మార్చేసారని వాపోతున్నారు. ఇలా చేస్తే ఎలా అని సోషల్ మీడియా వేదికగా కూటమీ నాయకులు ఎండగట్టారు. ఇదొక స్కామ్ క్వాలిటీ వస్తువులను తీసుకొని లోకల్ వస్తువులు వేయడం ప్రజా స్వామ్యంలో గడిచిన వైకాపా ప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు చేయడం తగునా అని ఎండగట్టారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *