సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు


కేంద్రానికి కొలీజయం సిఫారసు
న్యూదిల్లీ:
సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో శుక్ర, బుధవారాల్లో సమావేశమైన కొలీజియం..,అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. ఇందులో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, ఒకరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఆరు ఖాళీలున్నాయి. ఇప్ప్పుడున్న 32 మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ బీవీ నాగరత్న మాత్రమే మహిళ. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కొలీజియం ఇప్ప్పుడు సీనియర్ న్యాయవాది వీ మోహన పేరు సిఫార్సు చేసింది. ఈమె నియామకానికి ఆమోదముద్ర పడితే కోర్టులో మహిళా జడ్జీల సంఖ్య రెండుకి చేరుతుంది. ఆమె సుప్రీంకోర్టులో 12వ మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కుతారు. 2021 ఆగస్టు 17న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఒకేసారి తొమ్మిదిమంది పేర్లను సిఫార్సుచేసి, రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ఒకేసారి ఐదుగురి పేర్లను సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. మహిళను జడ్జిగా సిఫార్సు చేయడం ఆ తర్వాత ఇదే ప్రథమం.
మోహనకు సీనియర్లతో కలసి పని చేసిన అనుభవం…
న్యాయవాది మోహన 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అయిదేళ్ల లా డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఇందు మల్హోత్రా, సీఎస్ వైద్యనాథన్‌ల వద్ద జూనియర్‌గా పనిచేశారు. 1996లో ఏఓఆర్ పరీక్ష పాసైన తర్వాత దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. వివిధ కేసుల్లో సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబల్, Âకేకే వేణుగోపాల్, పీ చిదంబరం, అరున్‌జైట్లీ, అంద్యార్జునలతో కలిసి పనిచేశారు. 2015 ఏప్రిల్ 23న సీనియర్ న్యాయవాది హోదా పొందారు.

The post సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *