విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి వద్ద గల పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం సజావుగా జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిని కళ్యాణి, నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో ప్రభుత్య పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరంలో నిర్వహించామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలో జాబ్ మేళా స్థానిక ప్రభుత్య పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నిర్వహించటం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ జాబ్ మేళాకి 10 కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళా కు సుమారు 74 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 41 మంది వివిధ కంపనీలకు ఎంపిక కావడం జరిగింది అని తెలిపారు. ఈ యొక్క జాబ్ మేళ కార్యక్రమంలో ధర్మవరం బీజేపీ నాయకులు హరీష్ , A.P స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, సీడాప్ సిబ్బంది, ఎంప్లాయిమెంట్ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
The post సజావుగా జరిగిన జాబ్ మేళా.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు appeared first on Visalaandhra.


