ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో టాపర్గా వచ్చిన ధర్మవరం విద్యార్థిని దేవర అనూష



ఇటీవల జరిగిన స్నాతకోత్సవాల్లో దేవర అనూషకు గోల్డ్ మెడల్

విశాలాంధ్ర ధర్మవరం;; చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో గల శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో జూన్ 10వ తేదీ జరిగిన 63-68 వా స్నాతకోత్సవాల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన దేవర సూర్యనారాయణ కుమార్తె దేవర అనూష ఎమ్మెస్సీ ఫిజిక్స్ 2023లో యూనివర్సిటీ టాపర్గా రావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు దేవర అనూషకు స్నాతకోత్సవాలు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా అనూష సాధించిన విజయానికి ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య టాటా నర్సింగరావు వారి సమక్షంలో గోల్డ్ మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లను వారి చేతుల మీదుగా అందుకున్నారు. దేవర అనూష ఇంటర్మీడియట్ ను ధర్మారంలోని సీతారామయ్య కళాశాలలోనూ పూర్తి చేసి, అదేవిధంగా డిగ్రీని స్థానిక రేగాటిపల్లి రోడ్డు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో అప్పట్లో టాపర్గా నిలిచి మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా దేవర అనూష మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల సహాయ సహకారాల వల్లే తాను సాధించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంకను మరింత ఉన్నత స్థాయికి చేరి, దేశ, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని తెలిపారు. తదుపరి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఇంటర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ధర్మవరం వాసులు దేవర అనూషకు ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *