విశాలాంధ్ర – హైదరాబాద్: పత్రికా స్వేచ్ఛ ఏ దేశమÖ వదులుకోలేని అమూల్యమైన హక్కు అని, నాలుగు స్తంభాలలో పత్రికా స్వేచ్ఛ ఒకటని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్వర్యంలో గురువారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగించారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని, ఏదైనా ఒక సంఘటన, కుంభకోణం వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీసి ప్రజలకు వెల్లడించే ప్రయత్నంలో ప్రాణాలు పణంగా పెట్టిన జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారని శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛ పట్ల నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు ఈ రోజు గుర్తు చేస్తుందని, ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు జర్నలిస్టుల ప్రాముఖ్యతను మనమందరం గుర్తించాలని తెలిపారు. లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సమర్పన్ డైరెక్టర్ లయన్ ప్రేమ్‌చంద్ మునోట్ జైన్ మాట్లాడుతూ… కఠిన పరిస్థితులలోనూ ప్రాణాలకు తెగించి నిజాలు నిర్భయంగా సమాజం ముందు పెడుతున్న పాత్రికేయులందరికీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం నుండి మీడియా రంగంలో ఒక్కరికి ఇచ్చే ‘భారత్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2026’ను కె.శ్రీనివాస్‌రెడ్డికి డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ప్రదానం చేశారు. శాలువా. పూలమాల, పుష్పగుచ్చం, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో శ్రీనివాస్‌రెడ్డిని ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా టీసీసీ కార్యదర్శి కె.రవీందర్, హైకోర్టు న్యాయవాది పి.రామ్ కిషోర్, టీఐఎఫ్ కోఆర్డినేటర్లు జి.వేణు గోపాల్, బిచ్చుకారి సూర్య ఆరెకటిక, టి.భూపాల్ రెడ్డి, శంకర్ సింగ్… శ్రీనివాస్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.
The post శ్రీనివాస్‌రెడ్డికి భారత్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ప్రదానం appeared first on Visalaandhra.


