
విశాలాంధ్ర, పెనుకొండ: మండల పరిధిలోని వెంకటగిరిపాలెం గ్రామానికి చెందిన రమేష్ (35) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామం నుంచి పని నిమిత్తం గుట్టూరు గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బొలెరో వాహనానికి అతని మోటార్ బైక్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.రమేష్ తల్లి వెంకటరత్నమ్మ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుండగా, అతనికి భార్య ఈశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


