రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ


కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి అంటే మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్‌లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి అత్యవసర సేవలు మినహా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్లపై బైక్‌లు, స్కూటర్లను అనుమతించరు. బెదిరింపులు, ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగిస్తారనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఈసీ పేర్కొంది. బైక్ ర్యాలీలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. పగటి పూట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య అత్యవసర పరిస్థితులు, పాఠశాలకు పిల్లల్ని దింపడం, తీసుకురావడం వంటి అత్యవసర పనులకు మినహా బైక్ వెనకాల మరొకరు కూర్చోవడాన్ని నిషేధించింది. పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని విధాల కృషి చేస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీకి లబ్ధి చేకూరేలా ఎన్నికల యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా ఓటర్ల హక్కులు రద్దు చేస్తోందని అధికార తణమూల్ ఆరోపించింది.

The post రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *