ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.
నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


