బాలికల భవిష్యత్తుకు బిగ్ స్టెప్.. చిత్తూరులో కిశోరి వికాసం ప్రత్యేక శిబిరాలకు శ్రీకారం..! kishori vikas camps in chittoor and beginning of empowerment | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించిన కిశోరి వికాసం వేసవి శిబిరాలు మే 1 నుంచి జూన్ 11 వరకు, బాలికల హక్కులు, భద్రత, విద్యపై అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు

News18
News18

బాలికల సాధికారతకు మరో ముందడుగు పడింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కిశోరి వికాసం.. అనే ప్రత్యేక వేసవి శిబిరాలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శ్రీకారం చుట్టారు. తన చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా & శిశు సంక్షేమ సాధికారత అధికారిణి శ్రీమతి వెంకటేశ్వరి, జిల్లా బాలల రక్షణ అధికారి డా. సుబ్రహ్మణ్యం, ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీ శివ శంకర్ పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ ప్రత్యేక శిబిరాలు మే 1, 2026 నుంచి జూన్ 11, 2026 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సెక్రటేరియట్ స్థాయిలో నిర్వహించబడనున్నాయి. బాలికల సమగ్ర అభివృద్ధి, వారి హక్కులపై అవగాహన కల్పించడం, సమాజంలో ధైర్యంగా ముందుకు నడిచేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

ఈ శిబిరాల్లో బాలికలకు మహిళా హక్కులు, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, బాలికలపై హింస & లైంగిక వేధింపుల నిరోధక చట్టాలపై అవగాహన కల్పించబడుతుంది. అంతేకాకుండా సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాల నివారణ, ఉన్నత విద్యా అవకాశాలు, వృత్తి మార్గదర్శకత్వం, ఆర్థిక నిర్వహణ వంటి కీలక అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రస్తుత కాలంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ శిబిరాలు రూపుదిద్దుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ హక్కులను తెలుసుకుని, స్వయం సాధికారత దిశగా అడుగులు వేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఈ శిబిరాలు విజయవంతం కావాలంటే అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సమాజం కలిసి కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఈ కార్యక్రమం ప్రభావవంతంగా అమలు చేయాలని, బాలికల భవిష్యత్తు బలోపేతానికి ఇది కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. బాలికల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కిశోరి వికాసం శిబిరాలు జిల్లాలో ఒక సానుకూల మార్పుకు నాంది పలకనున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *