బక్రీద్ పర్వదినం వేళ… జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు


జిల్లా ఎస్పీ పి.జగదీష్

విశాలాంధ్ర (అనంతపురం టౌన్) : బక్రీద్ పండుగ పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మసీదులు, ప్రార్థనా స్థలాలు, ఆయా పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఆయా పరిసరాలలో సంచరించకుండా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బక్రీద్ సందర్భంగా ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సులభతరం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *