-సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్
విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న పి. విజయకుమారికి డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి (ప్రమోషన్) పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విజయకుమారిని కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సి. జాఫర్ మాట్లాడుతూ… పి. విజయకుమారి రాప్తాడు తహశీల్దారుగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె ప్రతిభకు, నిబద్ధతకు గుర్తింపుగానే ఈ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి దక్కిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని, ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన పాలనను అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాఫర్ తో పాటు లాయర్ లక్ష్మన్న ఉన్నారు.


