పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..


రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ అధ్యక్షులు నాగభూషణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు నాగభూషణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ద్వారా వందలాది మందికి కంటి ఆపరేషన్ లతో పాటు, ఉచితంగా అద్దాలు మందులు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరంలో 92 మంది కంటి రోగులు రాగా అందులో కంటి వైద్య చికిత్సలు అందించిన తర్వాత 67 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు వై వెంకటేష్ జ్ఞాపకార్థం వీరి సతీమణి వై సరోజమ్మ, కుమారుడు వంశీకృష్ణ కోడలు శివజ్యోతి వ్యవహరించడం పట్ల వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం దాతను, శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు జోనల్ ఇంచార్జ్ గురుప్రసాద్ లను రోటరీ క్లబ్ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జయసింహ, కొండయ్య, సాంస్కృతిక మండలి అధ్యక్షులు శత్రశాల ప్రసన్నకుమార్, శివయ్య, జయచంద్ర, పెరుమాళ్ళ దాస్, మనోహర్ గుప్తా, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *