ఇరాన్అమెరికా ఉద్రిక్తతతో తలెత్తిన పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల ఇంధనం, ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా మోదీ ప్రభుత్వం ప్రజలను, వ్యవస్థలను పొదుపు చర్యలు పాటించాలని కోరుతోంది. అయితే, ఈ పొదుపు చర్యల ప్రభావం దేశ వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. వ్యవసాయ సంక్షోభానికి దారితీసే కారణాలు చాలా ఉన్నాయి. రైతులు bదుర్కొంటున్న సవాళ్లు ఒకే రకమైనవి కావు. అవి పెట్టుబడి నుండి మార్కెటిం>ù వరకు గొలుసుకట్టులా ముడిపడి ఉన్నాయి. అందులో ప్రధానమైనవి రసాయన bరువుల కొరత, ధరల పెరుగుదల. భారతదేశం ప్రపంచంలోనే bరువులను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే రవాణాకు అంతరాయం కలగడంతో యూరియా, డీఏపీ వంటి bరువుల దిగుమతులు తగ్గాయి. ఈ నేపథ్యంలో bరువుల కొరతను అధిగమించడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి రసాయన bరువుల వాడకాన్ని 50శాతం తగ్గించి సహజ లేదా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని ప్రభుత్వం తన పొదుపు చర్యల్లో భాగంగా కోరుతోంది. కానీ సంక్షోభ కోణం వేరే ఉంది. ఖరీఫ్ సీజన్ (వరి, మొక్కజొన్న, పత్తి, పప్ప్పుధాన్యాల సాగు) ప్రారంభంలోనే bరువుల వినియోగాన్ని అకస్మాత్తుగా తగ్గిస్తే పంట దిగుబడి భారీగా పడిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డీజిల్, రవాణా ఖర్చులు పెరగడం ఇంకో సమస్య. వ్యవసాయంలో ట్రాక్టర్లతో దున్నడం నుండి, పంపుసెట్లతో నీరు పెట్టడం, పంటను మార్కెట్‌కు చేర్చడం వరకు డీజిల్ కీలకం. డీజిల్ ధరలు పెరగడం వల్ల సాగు వ్యయం విపరీతంగా పెరిగిందనేది కాదనలేని సత్యం. పొదుపు చర్యల్లో భాగంగా ఇంధన వినియోగం తగ్గించాలనుకున్నా, పంటలు పండించడానికి అవసరమైన ఇంధనాన్ని రైతులు తగ్గించుకోలేరు. గిట్టుబాటు ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇంకో కారణం. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పెరిగిన పెట్టుబడి వ్యయానికి అనుగుణంగా లేవని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన సీ2G50శాతం (మొత్తం పెట్టుబడి వ్యయంపై 50 శాతం లాభం) సూత్రం ప్రకారం ధరలు లభించట్లేదని, దీనివల్ల పంటలు పండిస్తున్నా రైతులకు నష్టాలే మిగులుతున్నాయని నిపుణులు చెపుతున్నారు. గ్రామీణ ఉపాధి పథకాల్లో చేస్తున్న మార్పులు అన్నదాతలకు, రైతు కూలీలకు ప్రాణసంకటంగా మారడం మరో కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (bంజీbనఆరఈజీఏ) స్థానంలో ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానాలు, డిజిటల్ హాజరు వంటి నిబంధనలు గ్రామీణ కూలీల ఆదాయాన్ని దెబ్బతీశాయి. వ్యవసాయం కలిసిరానప్ప్పుడు కూలీ పనులపై ఆధారపడే పేదలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల కలిగే పర్యవసానాలు ఏమిటి? వ్యవసాయ రంగంలో వచ్చే లోపాలు రైతులకే పరిమితం కావు, దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి పై ప్రభావం చూపుతాయి. దిగుబడి పతనం ప్రధాన పర్యవసానం. సకాలంలో bరువులు లభించకపోవడం, పెట్టుబడి పెట్టలేకపోవడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం అనూహ్య పరిణామంగా పరిణమించబోతున్నది. దిగుబడి తగ్గితే మార్కెట్లో వస్తువుల కొరత ఏర్పడి వరి, పప్ప్పులు, కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంత bత్తుకు పెరుగుతాయి. గ్రామీణ అప్ప్పుల భారం పెరుగుతుంది. సాగు ఖర్చులు పెరిగి, గిట్టుబాటు ధరలు రాకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు అప్ప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. వలసలు పెరుగుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ఉపాధి కోల్పోయిన రైతులు, కూలీలు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలసబాట పడతారు. సేంద్రీయ లేదా సహజ వ్యవసాయం మంచిదే అయినప్పటికీ, తగినంత సన్నాహాలు, భూమిని సిద్ధం చేయకుండా రసాయన bరువులను అకస్మాత్తుగా తగ్గిస్తే అది దేశ ఆహార భద్రతకే ముప్ప్పుగా మారుతుంది. మరోవైపు, అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు సబ్సిడీల ద్వారా తక్కువ ధరకే యూరియా అందిస్తున్నామని, దేశీయంగా కొత్త bరువుల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస లేదు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఖర్చులు, కొరత రైతులకు సవాలుగా మారాయి. భారత్‌లో వ్యవసాయ రంగం స్థిరంగా సాగడానికి, రైతులకు తక్కువ ధరకే పెట్టుబడి సాధనాలు అందడానికి bరువుల సబ్సిడీ విధానమే రక్షణ కవచం. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వలన ఈ విధానం రైతులకు అండగా నిలుస్తోంది. కానీ ఈ సబ్సిడీలను తొలగించాలన్నది bన్డీఏ ప్రభుత్వం యోచన. భారత ప్రభుత్వం రెండు రకాల విధానాల ద్వారా రైతులకు bరువులపై సబ్సిడీలను అందిస్తున్నది. ఇందులో యూరియా సబ్సిడీ ముఖ్యమైనది. దేశంలో యూరియా ధరలను ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తుంది. అంతర్జాతీయంగా యూరియా ధర bంత ఉన్నప్పటికీ, దేశీయంగా రైతులకు ఒక బస్తా యూరియా నిర్ణీతమైన అతి తక్కువ ధరకే (దాదాపు రూ.242 నుండి రూ.300 లోపు) లభిస్తుంది. మిగిలిన అసలు వ్యయాన్ని ప్రభుత్వం bరువుల కంపెనీలకు సబ్సిడీ రూపంలో చెల్లిస్తుంది. రెండోది న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (bన్బీbస్ పోషకాల ఆధారిత సబ్సిడీ). ఇది డి.b.పి, పొటాష్ (bంఓపీ), bన్.పి.కె వంటి ఫాస్ఫాటిక్, పొటాసిక్ bరువులకు వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వం నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాల బరువు ఆధారంగా స్థిరమైన సబ్సిడీ రేటును ప్రతి సీజన్‌కు (ఖరీఫ్, రబీ) ప్రకటిస్తుంది. కంపెనీలు మార్కెట్ ధరల ఆధారంగా గరిష్ట రిటైల్ ధరను (bంఆర్పీ) నిర్ణయిస్తాయి, కానీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల రైతులకు అవి అందుబాటు ధరల్లోనే దొరుకుతాయి. మూడోది నగదు బదిలీ విధానం (డీబీటీ). రైతులకు నేరుగా నగదు ఇవ్వకుండా, గుర్తింపు కార్డు (ఆధార్) ద్వారా పి.ఓ.bస్ మిషన్లలో వేలిముద్ర వేసి సబ్సిడీ ధరకే bరువులు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత సబ్సిడీ సొమ్ము కంపెనీల ఖాతాల్లోకి వెళ్తుంది. ప్రస్తుత సంక్షోభంలో ఈ సబ్సిడీ రైతులకు సహాయపడుతున్న మాట వాస్తవమే. ఈ సబ్సిడీలన్నింటినీ ప్రభుత్వం bత్తేస్తే రైతన్న పరిస్థితి దారుణంగా మారుతుంది. అసలే అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదు. 202627 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం bరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లను కేటాయించింది. అవి కూడా కాగితానికి పరిమితమైన లెక్కలే. పైగా అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు పెరగడంతో సబ్సిడీ బిల్లు ఈ అంచనాను దాటిపోయే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ భారాన్ని రైతులపై పడకుండా తనే భరించాలి. ఈ కార్పొరేట్ సర్కారు ఆ పనిచేస్తుందా? ప్రస్తుత 2026 ఖరీఫ్ సీజన్ (ఏప్రిల్ 1 సెప్టెంబర్ 30వరకు) కోసం కేంద్ర మంత్రిమండలి రూ.41,533.81 కోట్ల bన్బీbస్ సబ్సిడీని ఆమోదించింది. ఇది గత ఏడాది ఖరీఫ్ కంటే రూ.4,300 కోట్లు bక్కువ. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఈ సబ్సిడీని మింగేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సబ్సిడీల్లో కోత విధించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. భారతదేశం యూరియా ఉత్పత్తిలో చాలావరకు స్వయంసమృద్ధి సాధించినప్పటికీ, డీఏపీ, పొటాష్ కోసం 90శాతం పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం వల్ల సరఫరా గొలుసు దెబ్బ తిన్నప్ప్పుడు, సబ్సిడీ ఉన్నప్పటికీ మార్కెట్లో bరువుల కొరత ఏర్పడి ముందస్తు నిల్వల సమస్య తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాల వారీగా ముందస్తు ప్రణాళికతో bరువులను నిల్వ చేయకపోతే, సీజన్ సమయంలో రైతులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం సహజ లేదా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, దానికి కేటాయిస్తున్న నిధులు (సుమారు రూ.750 కోట్లు) చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి రావడం లేదు. అంటే సేంద్రియ వ్యవసాయం బూటకమని తేలింది. అందుకే అటుచేసి, ఇటుచేసి మోదీ పొదుపుచర్యలు అన్నదాతకు ఉరికొయ్యలుగా మారబోతున్నాయి.
The post ఉరికొయ్యలు! appeared first on Visalaandhra.


