పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించండి..


ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; మే 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతమును సాధించాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 నిమిషముల వరకు నిర్వహిస్తామని తెలిపారు. మీ 25న ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు (గ్రూప్ ఎ,) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిట్ కోర్స్, 26వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ హిందీ, మే 28న ఆంగ్లము, మే 29న గణితము, మే 3వ తేదీన ఫిజికల్ సైన్స్, జూన్ 1వ తేదీ బయాలజీ సైన్స్, జూన్ రెండవ తేదీ సాంఘిక శాస్త్రము, జూన్ మూడవ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్, జూన్ 4వ తేదీ ఓ ఎస్ ఎస్ సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టు సబ్జెక్టులు ఉంటాయని తెలిపారు. విద్యార్థులందరూ చది అయిన సమయానికి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని తెలిపారు. తదుపరి ఫెయిల్ అయిన విద్యార్థులను ఆయా ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ల పర్యవేక్షణలో సంబంధిత విషయాలు అదనపు తరగతులను నిర్వహిస్తూ చక్కటి ఉత్తీర్ణత శాతమునకు కృషి చేయాలని వారు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *