విశాలాంధ్ర ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉరవకొండ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీడీవో రవి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల సేవలను కొనియాడారు. గ్రామ శుభ్రత, పారిశుధ్యం, ప్రజా సేవల నిర్వహణలో పంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. వారి అహర్నిశల శ్రమతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ సతీష్ కుమార్, గ్రామ కార్యదర్శి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, పంచాయతీ కార్మికులు నిస్వార్థంగా సేవలందిస్తూ గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారి సేవలను గౌరవించడం సమాజ బాధ్యత అని అన్నారు. మాజీ వార్డ్ సభ్యులు నిరంజన్ గౌడ్, రామాంజనేయులు పాల్గొని కార్మికులను అభినందించారు.


