తిరుమలలో రాజకీయ ప్రచారం కలకలం.. విజయ్ ఫొటోతో విజిల్ ఊదిన మహిళ..! political vigil controversy in tirumala video with vijay photo goes viral. |


Last Updated:

తిరుమలలో Tamilaga Vettri Kazhagamకు మద్దతుగా విజిల్ ఊదిన మహిళా భక్తురాలు, విజిల్‌పై Vijay ఫొటోతో రాజకీయ ప్రచారం వీడియో వైరల్, టీటీడీపై భద్రత ప్రశ్నలు.

+

విజయ్

విజయ్ ఫొటోతో ఉన్న విజిల్‌తో తిరుమలలో ప్రచారం..!

తిరుమలలో మరోసారి భక్తుల అత్యుత్సాహం చర్చనీయాంశంగా మారింది. పవిత్రక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో నియమ నిబంధనలు మరింత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ, కొందరు భక్తులు వాటిని లెక్కచేయకుండా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటానికి, భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు Tirumala Tirupati Devasthanams రీల్స్ చేయడం, వీడియోలు చిత్రీకరించడం వంటి చర్యలను పూర్తిగా నిషేధించింది.

అయితే ఈ నిబంధనలను పక్కన పెట్టి తిరుమలలో ఇటీవల జరిగిన ఒక ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళా భక్తురాలు, Tamilaga Vettri Kazhagam పార్టీకి మద్దతుగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. నాదనీరాజం సమీపంలో ఆమె విజిల్ ఊదుతూ, ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంకా వివాదాన్ని మరింత పెంచిన అంశం ఏమిటంటే, ఆమె చేతిలో ఉన్న విజిల్‌పై ప్రముఖ నటుడు Vijay ఫొటో ఉండటం. తిరుమల వంటి పవిత్రక్షేత్రంలో రాజకీయ ప్రచారానికి సంబంధించిన వస్తువులను తీసుకురావడం, వాటితో ప్రచారం చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రదేశంలో వ్యక్తిగత ప్రచారాలు, సోషల్ మీడియా హడావుడి పెరగడం పట్ల భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తిరుమల వంటి క్షేత్రంలో ఇలాంటి చర్యలు జరుగుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు, ఇంత కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయి? భద్రతా సిబ్బంది ఎందుకు అడ్డుకోలేకపోయారు? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తబడుతున్నాయి. ఆలయ పరిసరాల్లో నిషేధిత కార్యకలాపాలు జరుగుతుండటం పట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ మరింత కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. పవిత్రక్షేత్రంగా ఉన్న తిరుమల ఆధ్యాత్మికతకు భంగం కలగకుండా కట్టుదిట్టమైన నిఘా అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *