Last Updated:
చిత్తూరు కుప్పం పి.ఇ.ఎస్. హాస్పిటల్ అత్యవసర, ప్రసూతి సేవల్లో పేరుపొందింది, డాక్టర్ ప్రదీప్ నేతృత్వంలో నెలకు వందల నార్మల్ డెలివరీలు, తక్కువ ఖర్చుతో సేవలు అందుబాటులో ఉన్నాయి
చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఉన్న పి.ఇ.ఎస్. హాస్పిటల్ ప్రస్తుతం ప్రజలకు ప్రాణాధారంగా మారింది. వీకోట నుంచి కుప్పంకు వెళ్లే జాతీయ రహదారిపై ఉన్న ఈ ఆసుపత్రి, అత్యవసర చికిత్సలలో జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఏ అత్యవసర పరిస్థితి తలెత్తినా, అందుబాటులో ఉన్న వాహనంతో వెంటనే ఈ హాస్పిటల్‌కు చేరుకుంటే ప్రాణాలతో బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా ప్రసూతి సేవల విషయంలో ఈ హాస్పిటల్ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. మహిళలకు గుర్తొచ్చే మొదటి ఆసుపత్రిగా నిలిచిన పి.ఇ.ఎస్., నార్మల్ డెలివరీలలో దిట్టగా పేరు సంపాదించింది. ఇక్కడ ప్రసూతి వార్డు హెచ్.ఓ.డి.గా పనిచేస్తున్న డాక్టర్ ప్రదీప్ గత 17 సంవత్సరాలుగా సేవలందిస్తూ వార్డుకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో హై రిస్క్ కేసులు వచ్చినా సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ చేయడానికి వైద్య బృందం కృషి చేస్తోంది.
రోజుకు 200 మందికి పైగా గర్భిణీలు ఓపికి రావడం, నెలకు సుమారు 376 వరకు నార్మల్ డెలివరీలు నిర్వహించడం ఈ ఆసుపత్రి సామర్థ్యానికి నిదర్శనం. తెల్ల రేషన్ కార్డ్ కలిగిన వారికి తక్కువ ఖర్చుతోనే డెలివరీ సౌకర్యం అందిస్తున్నారు. నార్మల్ డెలివరీ ప్యాకేజీ సుమారు 17 వేల రూపాయలు కాగా, సిజేరియన్ డెలివరీ 35 వేల వరకు అందుబాటులో ఉంది.
ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే.. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి, శిశువు వెళ్లే సమయంలో వారి ఫోటో, బిడ్డ జన్మించిన సమయం, తేదీ వివరాలతో పాటు, శిశువుకు తొలి బట్టలు కూడా ఆసుపత్రి నుంచే అందిస్తున్నారు. ఈ సేవలు గర్భిణీలకు మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
అదేవిధంగా, ఎక్కువ మంది గర్భిణీలు అనిమియా సమస్యతో బాధపడుతున్నారని, ఇది పౌష్టికాహార లోపం వల్లే వస్తుందని డాక్టర్ ప్రదీప్ తెలిపారు. అందుకే గర్భిణీలు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని సూచించారు. ప్రత్యేక సౌకర్యాలతో గదులు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్న ఈ హాస్పిటల్ సేవలను గర్భిణీలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం 9573032111, 9493032111 నంబర్లను సంప్రదించవచ్చని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh


