ఖరీఫ్ ముంగిట అన్నదాతకు సంకటం


. 25 లక్షల భూసార కార్డుల పంపిణీలో జాప్యం
. ఆర్భాటపు ప్రకటనలు.. అరకొర ఆచరణ
. తూతూ మంత్రం నివేదికలతో సరి
. సిబ్బంది కొరతతో ముందుకు సాగని మట్టి పరీక్షలు
. అయోమయంలో రైతాంగం

విశాలాంధ్ర-సచివాలయం:
రాష్ట్రంలో ‘ఖరీఫ’ ముంచుకొస్తున్న తరుణంలో అన్నదాతలకు దిక్సూచిగా మారాల్సిన భూసార పరీక్షల ప్రక్రియ కేవలం ప్రభుత్వ కాగితాలకే పరిమితమవుతోందనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రసాయన ఎరువుల అడ్డగోలు వాడకాన్ని అరికట్టి, నేలతల్లికి పూర్వవైభవం తీసుకువస్తామని, పెట్టుబడి ఖర్చులు తగ్గించి లాభసాటి వ్యవసాయాన్ని అందిస్తామని పాలకులు కోటలు దాటేలా ప్రకటనలు గుప్పిస్తున్నా…క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా తయారైంది. ఈ ఏడాది ఏకంగా 25 లక్షల మట్టి నమూనాలను సేకరించి రికార్డు స్థాయిలో భూసార కార్డులను పంపిణీ చేయాలని అధికార యంత్రాంగం భారీ లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే, ఇప్పటివరకు కేవలం 6.76 లక్షల మందికి మాత్రమే కార్డులు అందాయన్న అధికారిక లెక్కలు ఈ పథకం అమలులో ఉన్న నత్తనడకను స్పష్టం చేస్తున్నాయి. సాగు పనులు ప్రారంభమై, విత్తనాలు నాటే సమయం ఆసన్నమవుతున్నా… ఇంకా లక్షలాది మంది రైతుల చేతుల్లోకి భూసార నివేదికలు చేరకపోవడం వ్యవసాయ శాఖ ఉదాసీనతకు అద్దం పడుతోంది. గతంలో రికార్డు స్థాయిలో కార్డులు ఇచ్చామని…పాత మైలురాళ్లను గుర్తు చేసుకుంటున్న అధికారులు… ప్రస్తుత విడతలో కనీసావసరాలను సైతం సకాలంలో తీర్చలేకపోవడం గమనార్హం. ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ వేగంగా మట్టి నమూనాలు సేకరిస్తున్నామని చెప్తున్నప్పటికీ సిబ్బంది కొరత, ప్రణాళికా లోపం వల్ల క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర అయోమయానికి అసమ్మతి ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. టీఎంసీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో సుమారు 20 మంది ప్రస్తుతం రాజధాని నగరంలోని ఒక రహస్య ప్రదేశంలో బస చేశారు. ఎంపీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి… కనిపించకుండా పోయారు. పార్టీ సీనియర్ నాయకులు తమను సంప్రదించలేకపోతు న్నారని వచ్చిన వార్తలతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమయింది. ప్రస్తుతం లోక్‌సభలో టీఎంసీకి 28 మంది సభ్యులు ఉండగా, రాజ్యసభలో 12 మంది ప్రతినిధులు ఉన్నారు.
టీఎంసీ ఎంపీ ఘోష్ దస్తిదార్ పీటీఐతో ఫోన్‌లో మాట్లాడుతూ ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని ఎంపీలు స్పీకర్‌కు తెలియజేశారని వివరించారు. ‘నాతో సహా దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి… ఎన్డీఏకు లాంఛనంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మేము లోక్‌సభ స్పీకర్‌కు లేఖ పంపి… ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని అందులో పేర్కొన్నాం’ అని ఆమె తెలిపారు. ఘోష్ దస్తిదార్ లోక్‌సభలో పార్టీకి చట్టబద్ధమైన చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారని, పార్టీ నాయకత్వం ప్రకటించిన తదుపరి మార్పులు అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా జరగలేదని స్పీకర్ ముందు వాదించాలని అసమ్మతి ఎంపీలు భావిస్తున్నట్లు అసమ్మతి వర్గాలు తెలిపాయి. 20 మంది ఎంపీల బృందంలో కాకోలి ఘోష్ దస్తీదార్, షర్మిల సర్కార్, పార్థ భౌమిక్, అరూప్ చక్రవర్తి, అసిత్ మాల్, దేవ్, రచనా బెనర్జీ, శతాబ్ది రాయ్, జూన్ మాలియా, యూసుఫ్ పఠాన్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘోష్ దస్తిదార్‌ను చీఫ్ విప్ పదవి నుంచి తొలగించి… ఆమె స్థానంలో కల్యాణ్ బెనర్జీని నియమించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ సచివాలయానికి తెలియజేయలేదని మరో తిరుగుబాటు ఎంపీ పీటీఐకి తెలిపారు. తాను లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌గా కొనసాగుతున్నానని పేర్కొంటూ, తోటి పార్లమెంటు సభ్యులతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని ఘోష్ దస్తిదార్ అన్నారు. ‘మేము ప్రజల తీర్పును అంగీకరించాము. మా భవిష్యత్ రాజకీయ గమనం ఎన్డీఏకు అనుగుణంగా ఉండాలని మేము విశ్వసిస్తున్నాము’ అని ఆమె తెలిపారు. అయితే అసమ్మతి వర్గాల వర్గాల సమాచారం ప్రకారం ఎంపీలు వెంటనే టీఎంసీకి రాజీనామా చేయడానికో లేదా బీజేపీలో చేరడానికో నిర్ణయించుకోలేదు. దానికి బదులుగా… ఎన్డీఏకు మద్దతు ఇస్తూనే ఒక ప్రత్యేక పార్లమెంటరీ కూటమిగా పని చేయాలని భావిస్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రక్షణ పొందేందుకు ఇది ఒక వ్యూహం. ఈ లెక్కకు రాజకీయ ప్రాముఖ్యత ఉంది. బసిర్‌హట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణంతో ఒక స్థానం ఖాళీ అవ్వగా… ప్రస్తుతం టీఎంసీకి 28 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రక్షణ పొందడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని 20 మంది ఎంపీల మద్దతుతో సులభంగా దాటవచ్చు. న్యూదిల్లీలో అసమ్మతి ఎంపీలు రహస్య సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది తమ ఎన్నికైన ప్రతినిధులపై టీఎంసీ నాయకత్వానికి ఉన్న అధికారంపై ప్రశ్నలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.

The post ఖరీఫ్ ముంగిట అన్నదాతకు సంకటం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *