కృష్ణలంక ఘటన: చంద్రబాబు ఆ సీఐ వైపు నిలబడితే.. రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుంది?


పోలీసు వ్యవస్థలో లాకప్ డెత్ అనేది అత్యంత వివాదాస్పదమైన, సున్నితమైన అంశం. విజయవాడ కృష్ణలంక ఘటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు దీని చుట్టే తిరుగుతున్నాయి. సహజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి పోలీసులను బలిపశువులను చేస్తుంటాయి. కానీ, ఈ కేసులో మృతుడి నేర చరిత్ర (22 కేసులు, పోక్సో, హత్య), సీఐ నాగరాజ్‌కు ఉన్న మంచి పేరును పరిగణనలోకి తీసుకుని.. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సీఐకి అండగా నిలబడితే రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు వస్తాయి? అది టీడీపీకి లాభిస్తుందా? నష్టపరుస్తుందా? అన్నది చూద్దాం.

లాకప్ డెత్.. ఒక ఊహించని విషాదం:
పోలీస్ ,న్యాయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఐ నాగరాజ్ ఒక నిజాయితీ గల అధికారి. లా అండ్ ఆర్డర్‌ను కాపాడటంలో, బాధితులకు అండగా నిలబడటంలో ఆయనకు మంచి పేరుంది. వాస్తవానికి పోలీసు వ్యవస్థలో ఎవరూ కూడా లాకప్ డెత్ చేయాలని ఉద్దేశపూర్వకంగా కొట్టరు. నేరస్థుడు నిజాలు చెప్పకపోవడం, పదేపదే నేరాలు రిపీట్ చేస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు.. విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ బేసిక్స్ దాటి కొట్టడం జరుగుతజైుంది. పైగా గంజాయి, మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసైన నేరస్థుల శరీరం ఫిట్‌గా ఉండదు. ఆ దెబ్బలను తట్టుకోలేక అనుకోకుండా ప్రాణాలు విడుస్తారు. ఒకవేళ పోలీసులే పక్కా ప్లాన్ ప్రకారం చంపేయాలనుకుంటే ఃఎన్‌కౌంటర్ః అనే బ్రహ్మాస్త్రం వాడి ఆత్మరక్షణ కింద కేసును క్లోజ్ చేస్తారు. కానీ ఇలా లాకప్ డెత్ కావడం వల్ల ఒక నిజాయితీ గల అధికారి తన ఉద్యోగాన్ని, జీవితాన్ని కోల్పోయి జైలు పాలవడం నిజంగా విషాదకరం.

చంద్రబాబు ముందున్న రెండు దారులు:

  1. సాంప్రదాయ రాజకీయ మార్గం (సేఫ్ గేమ్):
    ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ఒక కులానికి చెందిన ఓట్లు పోతాయన్న భయంతో, ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లి ఃఓదార్పు యాత్రలుః చేసి రాజకీయ లబ్ధి పొందుతాడన్న ఆందోళనతో.. ప్రభుత్వం వెంటనే సీఐని సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసు పెట్టడం.. తదితర పరిణామాలు ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రక్రియ మాత్రమే.
  2. సీఐకి అండగా నిలబడితే.. (సాహసోపేత నిర్ణయం):
    ఒకవేళ చంద్రబాబు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కనబెట్టి, ఁమరణించిన వ్యక్తి ఒక రేపిస్ట్, మర్డరర్. 22 కేసులున్న రౌడీ షీటర్. వాడి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. మా అధికారి ఉద్దేశపూర్వకంగా చంపలేదు. కనుక పోలీస్ లకు అండగా వుంటే రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. దాని వల్ల కలిగే లాభనష్టాలు ఇలా ఉంటాయి:

సానుకూల పరిణామాలు (లాభాలు):
పోలీసు వ్యవస్థలో నూతనోత్సాహం: ముఖ్యమంత్రి తమకు అండగా ఉన్నాడన్న భరోసా పోలీసుల్లో వస్తుంది. రాష్ట్రంలో నేరస్థుల వెన్నులో వణుకు పుడుతుంది. రౌడీయిజం, గంజాయి బ్యాచ్‌లను ఉక్కుపాదంతో అణచివేసేందుకు పోలీసులు ఏమాత్రం వెనుకాడరు. ఇది అంతిమంగా రాష్ట్రంలో శాంతిభద్రతలను అద్భుతంగా మారుస్తుంది.

సైలెంట్ మెజారిటీ మద్దతు: ప్రజల్లో (ముఖ్యంగా మహిళల్లో) రౌడీ షీటర్లు, రేపిస్టుల పట్ల తీవ్ర ఆగ్రహం ఉంటుంది. సాయి లాంటి వాడు చనిపోతే మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెట్టినా.. సామాన్య జనం మాత్రం పోలీసుల చర్యను హర్షిస్తారు. చంద్రబాబు ఃస్ట్రాంగ్ లీడర్ః (కఠిన పాలకుడు) అనే ఇమేజ్ మరింత బలపడుతుంది.

జగన్‌కు చెక్: జగన్ ఓదార్పు యాత్రకు వెళితే.. ఁచూశారా, ఒక రేపిస్ట్, మర్డరర్ ఇంటికి మాజీ సీఎం వెళ్లి పరామర్శిస్తున్నాడు. నేరస్థులను వైసీపీ ఎలా వెనకేసుకొస్తుందో చూడండిఁ అని కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేయవచ్చు. ఇది జగన్‌ను నైతికంగా ఆత్మరక్షణలో పడేస్తుంది.

ప్రతికూల పరిణామాలు (నష్టాలు – సవాళ్లు):
కుల సమీకరణాలు: మృతుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడం కూటమికి పెద్ద సవాల్. సీఐకి మద్దతిస్తే (ఆయన కూడా కాపే), దాన్ని వైసీపీ మరియు సాక్షి మీడియా బలంగా ప్రచారం చేస్తాయి. అయితే జనసేన, పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా కౌంటర్ చేస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

చట్టపరమైన చిక్కులు: చట్టం దృష్టిలో లాకప్ డెత్ నేరమే. సీఐని వెనకేసుకొస్తే న్యాయస్థానాల నుంచి, జాతీయ మానవ హక్కుల సంఘం (చీH్పు=) నుంచి ప్రభుత్వం మొట్టికాయలు తినాల్సి వస్తుంది.

ముగింపు:
క్యాన్సర్ గడ్డను కోసేటప్పుడు రక్తం కారడం సహజం. రాష్ట్రంలో గంజాయి, రౌడీయిజం అనే క్యాన్సర్‌ను ఆపరేషన్ చేస్తున్న పోలీసులకు ఒక్కోసారి ఇలాంటి అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. ఓట్లు పోతాయని భయపడి నిజాయితీ గల పోలీసులను జైలుకు పంపితే, రేపు నేరస్థులను పట్టుకోవడానికి ఏ పోలీసూ ధైర్యం చేయడు. ఒకవేళ చంద్రబాబు గారు రాజకీయ రిస్క్ తీసుకుని సీఐ నాగరాజ్ వైపు నిలబడితే.. తాత్కాలికంగా విమర్శలు వచ్చినా, దీర్ఘకాలంలో ఁలా అండ్ ఆర్డర్ఁ విషయంలో ఆయనొక ఆదర్శవంతమైన, ధైర్యవంతమైన సీఎంగా చరిత్రలో మిగిలిపోతారు ప్రతిపక్షాల ఓదార్పు యాత్రల డ్రామాలకు కూడా చెక్ పడుతుంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *