ఖైదీలు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆదాయం ఆర్జించడంలో కేరళ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కేరళ ఏటా రూ. 222.69 కోట్లు ఆర్జిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కేవలం రూ. 11.11 కోట్లతో దేశంలో 8వ స్థానంలో నిలిచింది. నివేదికలోని ఇతర కీలక అంశాల ప్రకారం, ఏపీలోని సెంట్రల్ జైళ్లు తమ సామర్థ్యానికి మించి ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో కలిపి 8,659 మందిని ఉంచే సామర్థ్యం ఉండగా, 2024 డిసెంబరు నాటికి 7,861 మంది ఖైదీలు ఉన్నారు.



