ఉరవకొండలో ఘనంగా టీడీపీ మహానాడు కార్యక్రమం


విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండలో రెండవ రోజు గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని కార్యకర్తలు టీవీల ద్వారా వీక్షించారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో కార్యకర్తల పాత్ర, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై సీఎం చేసిన దిశానిర్దేశాన్ని నాయకులు ఆసక్తిగా ఆలకించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పీఏసీఎస్ చైర్మన్ ప్యారం కేశవానంద్, కట్టుబడి కళ్ళందర్, తిమ్మప్ప, సి. నాగేశ్వరరావు తో పాటు పలువురు నాయకులు, మహిళ లు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *