లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి అధ్యక్షులు రమేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) జూన్ 21వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు లయన్స్ కంటి ఆసుపత్రి అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి కొత్తపాలెం వెంకటేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిర దాతలుగా కీర్తిశేషులు లయన్ గవ్వల (లడ్డు) లక్ష్మీనారాయణ, కీర్తిశేషులు గవ్వల బాబు (మాజీ వైస్ చైర్మన్), నా జ్ఞాపకార్థం మనవడు గవ్వల చందన్ అల్లుడు లయన్ బండి బాబు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా వందల శాంకలో ఉచిత శిబిరములతో పాటు, ఉచితంగా ఆపరేషన్లు ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. లయన్స్ కంటి ఆసుపత్రి ధర్మవరం నందు డాక్టర్ కిరణ్ కుమార్ వారి బృందంచే కంటి వైద్యులచే ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించబడునని తెలిపారు. బీపీ, షుగర్ ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకొని, వస్తే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా ధనవంతులకు కూడా ఇతర నగరాలకు వెళ్లకుండా తక్కువ ధరలకే మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. కంటి వైద్య చికిత్సలకు వచ్చువారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తో పాటు ఫోన్ నెంబరు, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావలెనని తెలిపారు. ఉచిత ఆపరేషన్లు ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట లో గల లయన్స్ కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తూ కంటి అద్దాలు కూడా ఉచితంగా ఇవ్వబడుతుందని తెలిపారు. చూపు తగ్గిన వారికి తక్కువ ఖర్చుతో లేజర్ చికిత్స కూడా నిర్వహిస్తామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


