ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరింత అభివృద్ధి చేస్తాం..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు. కార్యదర్శి సుభాష్ చంద్రబోస్.

విశాలాంధ్ర ధర్మవరం:: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సేవలను మరింత అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బాలరాజు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణములోని ఐఎంఏ పనితీరును, వారు చేస్తున్న సేవలను అధికార పూర్వకంగా సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఐఎంఏ చేస్తున్న సేవలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్బిఐ కాలనీ డాక్టర్ నరసింహులు స్వగృహములో పలు విషయాలను కూడా వారు చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐఎంఏ పనుల వివరాలను తెలియజేసి, ధర్మవరం మరింత ముందడుగు వేయాలని తెలిపారు. తదుపరి 2026 సంవత్సరమునకు 22 మంది ఐఎంఏ సభ్యత్వము తీసుకోవడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐఎంఏ సభ్యత్వంతో మరింత అభివృద్ధిని, సేవలను ప్రజలకు అందించాలని తెలిపారు. తదుపరి పుట్టపర్తి రోడ్డులో అతి త్వరలో ప్రైవేటు ల్యాండ్ ఐఎంఏ కార్యాలయం కొరకు చూస్తున్న స్థలాన్ని రాష్ట్ర కమిటీ వారు పరిశీలించి, సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ధర్మవరం ఐఎంఏ సభ్యులు అధ్యక్షులను, కార్యదర్శిని ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇటీవల రాష్ట్ర వైద్యుల పై దాడిని ఖండిస్తూ, రాష్ట్ర వైద్యులు చేపడుతున్న సేవలను వారు కొనియాడిన సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ధర్మవరం స్థానిక ఐఎంఏ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఐఎంఏ కార్యదర్శి వరుణ్ కుమార్ రెడ్డి తో పాటు రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు వైద్య మండలి పూర్వపు సభ్యులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ సభ్యులు డాక్టర్ నరసింహులు, స్థానిక ఐఎంఏ సభ్యులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ వాసుదేవరెడ్డి, డా. వెంకటరామిరెడ్డి, డాక్టర్ మదన్మోహన్ యాదవ్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ పద్మ, డాక్టర్ కుమార్ బాబు, డాక్టర్ జగదీష్, డాక్టర్ విక్రాంత్ ,ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నజీర్, హరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *