అమెరికాకు భారీ ఆయుధ నష్టం – Visalaandhra


సగం ఖాళీ అయిన ఎయిర్ డిఫెన్స్ క్షిపణిలు
వాషింగ్టన్:
యుద్ధ సమయాల్లో ఇరువర్గాలకు నష్టం కలుగుతోంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే…ఇరు పక్షాలకు దెబ్బలు తప్పవు. ఇది జనమెరిగిన సత్యం. ఇప్ప్పుడు అలాగే ఉంది అమెరికా వ్యవహారం. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదలోని సగం ఎయిర్‌డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మీడియా కథనాల ప్రకారం… ఇరాన్ పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్-3, స్టాండర్డ్ మిసైల్-6లను వినియోగించింది. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి. అమెరికా వద్ద ఇంకా సుమారు 200 థాడ్ ఇంటర్‌సెప్టర్‌లు మాత్రమే మిగిలిఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంత భారీస్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది అమెరికా-ఇజ్రాయెల్ సైనిక సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. ఇక, యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్‌సెప్టర్‌లు, 90 డేవిడ్ స్లింగ్‌లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న యెమెన్, లెబనాన్‌ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించింది. ఇదిలాఉండగా.. అమెరికా- ఇజ్రాయెల్ సైనిక సమన్వయాన్ని పెంటగాన్ సమర్థించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరుదేశాలు రక్షణ భారాన్ని సమానంగా మోశాయని పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సీన్ పార్నెట్ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *