అజేయం…అజరామరం
దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం . భూములిచ్చిన రైతులకు పాదాభివందనం. అమరావతిపై జగన్ ఊసరవెల్లి రాజకీయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర-సచివాలయం: అమరావతి అజేయం… అద్భుతం… అజరామరమని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శనివారం తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతు పలికిన శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ఇక ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్నారు….


