రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు.వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పటి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే 2019లో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగాన్ని చేశారు. 2019 తరువాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థల్లో…


