AP Pensions: ఏపీలో నేడు పెన్షన్ పండుగ.. ఒక్కరోజులోనే పంపిణీ పూర్తయ్యేలా ప్లాన్ |
ఆంధ్రప్రదేశ్‌లో 2026 మార్చి నెలకి సంబంధించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నేడు జరుగుతుంది. మార్చి 1 ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగా పంపిణీ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి ఈ పంపిణీ ఉంటుంది. ప్రభుత్వం 62,76,325 మంది లబ్ధిదారులకు రూ.2,725.79 కోట్లు విడుదల చేసింది. వీటిలో 8,977 మంది కొత్త వితంతువులకు రూ.3.59 కోట్లు ఇస్తారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ఇవాళ ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇస్తారు. మాగ్జిమం ఇవాళే అందరికీ…


