కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల కేసును విచారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమిషన్ భవితవ్యం ఏమిటన్నది తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం మరికొంత సమయం తీసుకుంది. ఈరోజు ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం, తుది తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం 2024 మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 6తో…


