బెంగాల్‌ను ముక్కలు చేసే కుట్రలు: మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సమగ్రతను దెబ్బతీసి, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి కొన్ని ప్రాంతాలను ఒడిశాలోనో, బిహార్‌లోనో కలపాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అలా జరిగితే బెంగాల్ ప్రజలు వేధింపులకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బాంకుడా, తూర్పు బర్ధమాన్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె ప్రసంగించారు. మైనారిటీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి బీజేపీ నేత సువేందు అధికారితో కలిసి…


