హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం
హైదరాబాద్ నుంచి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోమశిల మీదుగా సాగే ఈ యాత్రలో కృష్ణానది, నల్లమల అడవుల అందాలను గగనతలం నుంచి వీక్షించే అద్భుత అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థతో కలిసి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రపంచస్థాయి…


