విశాలాంధ్ర – లేపాక్షి: లేపాక్షిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీవిబి)లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన సుభానీ భీ కుమార్తె ఉన్నత చదువుల కోసం విద్యాలయ సిబ్బంది మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు.విద్యాలయంలో పనిచేస్తున్న బోధన, భోధనేతర సిబ్బంది కలిసి రూ.51 వేల మొత్తాన్ని మృతురాలి కుమార్తెకు అందించారు. ఈనెల 17వ తేదీన హిందూపురం నుంచి లేపాక్షిలోని విద్యాలయానికి విధులకు వెళ్తుండగా, టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదానికి గురై సుభానీ భీ మృతి చెందిన విషయం తెలిసిందే.మృతురాలికి 10వ తరగతి పరీక్షలు రాసిన కుమార్తె ఉండగా, కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఆమె ఉన్నత చదువులు కొనసాగించేందుకు ఈ సహాయం అందించామని విద్యాలయ ప్రత్యేక అధికారి నీలిమా తెలిపారు.విద్యార్థినికి అండగా నిలిచిన సిబ్బంది చర్యపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.


