యుద్ధం ముగింపునకు ఇరాన్ రెండు దశల ప్రణాళిక?


వాషింగ్టన్: అమెరికాతో యుద్ధం ముగించేందుకు, ీVAర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్లు ఓ అమెరికన్ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ప్రతిపాదన లను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ తెలియజేసిందని తెలిపింది. అమెరికన్ మీడియా సంస్థ కథనం ప్రకారం… గల్ఫ్ సముద్ర జలాల్లో అమెరికా – ఇరాన్ ఘర్షణను ముగించేందుకు, అమెరికా నౌకాదళం చేస్తున్న ఇరాన్ ఓడరేవుల ముట్టడిని ఆపేందుకు రెండు దశల ప్రణాళికను ఇరాన్ ప్రతిపాదించింది. ఇందుకోసం రెండు దేశాలు పరస్పర అంగీకారంతో కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపును పలకడమో చేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ీVAర్మూజ్ జలసంధిని తెరవడం, ఇరాన్ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడం అనేవి జరిగాకే తమ అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలకు సిద్ధపడతామని ఇరాన్ తెలిపింది. ఇరాన్ కొత్త ప్రతిపాదనలు తమకు అందాయని అమెరికా వైట్ హౌస్ అధికార వర్గాలు తెలిపాయని అమెరికన్ మీడియా కథనంలో ప్రస్తావించారు. అయితే వాటిని పరిశీలించడానికి అమెరికా సుముఖంగా ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని పాక్‌లోని ఓ మీడియా సంస్థ అధిపతి కమ్రాన్ ఖాన్ వెల్లడించారు. దౌత్యపరమైన పురోగతి క్రమంగా పెరుగుతోందని, దీనివల్ల ఇప్పుడు సొరంగం చివరి వెలుగును చూడగలిగే దశ వచ్చిందని ఆయన తెలిపారు. అమెరికా- ఇరాన్ చర్చలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న అధికార వర్గాల నుంచి తమకు ఈ సమాచారం అందిందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *