Flexi Controversy: కూటమి కలహాలు.. ఫ్లెక్సీపై సీఎం ఫొటో మిస్సింగ్.. టీడీపీ-జనసేన మధ్య తోపులాట..! flexi dispute in pithapuram tension between tdp. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

పిఠాపురంలో PMJAY కార్యక్రమం ఫ్లెక్సీలో N చంద్రబాబు ఫొటో లేకపోవడంతో టిడిపి జనసేన నేతల మధ్య వాగ్వాదం తోపులాట, పోలీసులు జోక్యం, కూటమి విభేదాలు బహిర్గతం.

+

పిఠాపురంలో

పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన పైట్ 

డిప్యూటీ సీఎం Pawan Kalyan ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మిత్రపక్షాలైన Telugu Desam Party, Jana Sena Party మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఫొటో లేకపోవడం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసి, తోపులాట వరకు వెళ్లింది. చిన్న విషయంగా మొదలైన ఈ వివాదం క్షణాల్లోనే రాజకీయ వేడి పెంచింది.

మంగళవారం పిఠాపురంలో నిర్వహించిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫొటో కనిపించకపోవడాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ గుర్తించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సీఎం ఫొటో లేకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని ఆయన జనసేన నాయకులు, అధికారులను నిలదీశారు. ఈ వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఈ క్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబుతో వర్మకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కల్పించుకుని వర్మపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పేలా మారుతుండటంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు.

అనంతరం వర్మ తీవ్రంగా స్పందిస్తూ దొరబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “జనసేన, టీడీపీ ఒకే కుటుంబం. కానీ వైసీపీ నుంచి వచ్చిన వారు ఇక్కడ పెత్తనం చెలాయిస్తే ఎలా? క్రమశిక్షణ తప్పితే తోలు తీస్తా” అంటూ ఘాటుగా హెచ్చరించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తామంతా కష్టపడితే, గెలిపించిన టీడీపీ నాయకులపైనే దాడులు చేయడం సమంజసం కాదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అవమానం జరిగితే సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘటనతో పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం మరోసారి బయటపడింది. ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం ఎలా పెద్ద రాజకీయ ఘర్షణగా మారుతుందో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *