వైభవంగా ‘అడ్డపల్లకి’ గ్రామోత్సవం..
-ఆకట్టుకున్న సంప్రదాయ కళాకారుల నృత్యాలు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గవిమఠం శ్రీస్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అడ్డపల్లకి-గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని వెలిగొండ రహదారిలో ఉన్న విడిది మఠంలో పీఠాధిపతికి గవిమఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్, అర్చకులు ప్రత్యేక పాదపూజ నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వాముల వారిని పల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల…


