అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం
న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ…


