నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం – Visalaandhra

కేసీఆర్ సభకు రావాలిగవర్నర్ ప్రసంగం అభివృద్ధికి మార్గదర్శిభవిష్యత్‌లో ఏఐ సునామీ: సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాజులు… రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్ప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్ప్పు చేశారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఉద్దేశించి బుధవారం ఆయన మాట్లాడుతూ నియంత పోకడలను…

Read More

‘మూసీ’పై మంటలు

. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు. ఉన్నత జీవనస్థితి కల్పిస్తాం: అధికార పక్షం. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకం: బీఆరఎస్. ప్రక్షాళనపై అట్టుడికిన శాసనసభ విశాలాంధ్ర – హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుపై శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మూసీ ప్రక్షాళనపై వాదోపవాదాలు జరిగాయి. మూడోరోజైన బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళన చేసి పరీవాహక ప్రజలకు ఉన్నతమైన జీవనస్థితి కల్పిస్తామని అధికార కాంగ్రెస్ చెబుతుండగా, మూసీ…

Read More

భవన నిర్మాణ కార్మికులబానిసత్వం ఇంకెన్నాళ్లు ?

భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం నిర్మాణరంగం. ఈ నిర్మాణ రంగంలో కొన్ని కోట్ల మంది పనులు నిర్వహిస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో కార్మికులకు పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాల నివారణకు వారి సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేశాయి. 1990లో ఏఐటియుసి నాయకత్వాలు భవన నిర్మాణ కార్మికుల రక్షణకు, ప్రమాదాల నివారణకు చట్టం అవసరమంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆందోళనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం…

Read More

ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు – Visalaandhra

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన…

Read More

భారత్ దౌత్యం పై విమర్శలు – Visalaandhra

అసద్ మిర్జా అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం…

Read More

ఉమ్మడి పౌర స్మృతి సందడి – Visalaandhra

ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి గుజరాత్ శాసనసభలో బుధవారం బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు వివాహం, విడాకులు, వారసత్వం, పెళ్లి చేసుకోకుండానే స్త్రీ పురుషుల సహజీవనం లాంటి అంశాలలో ఏక రీతి తీసుకురావడానికి ఉద్దేశించింది. అంటే కులం, మతం, జాతీ, స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలుచేయడం గుజరాత్ బిల్లు మౌలిక లక్ష్యం. అంతకుముందు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్…

Read More

యుద్ధం ఆపండి

వ్యతిరేక కమిటీ ఏర్పాటువిశాలాంధ్ర- హైదరాబాద్ : ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దుంభవన్‌లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన బుధవారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియా మధ్య- ప్రాచ్యంలో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశంలో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో…

Read More

నేను బతికే ఉన్నా: నెతన్యాహు – Visalaandhra

తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్‌కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే…

Read More

రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి కి ఎంపీ వేమిరెడ్డి వినతి

విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్రవినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో కలిసి ఆయనను కలిసి ఆంధ్రప్రదేశ్‌ చౌక ధరల దుకాణ దారుల సంక్షేమ సమాఖ్య, ఆల్‌ ఇండియా ఫేర్‌ ప్రైజ్‌ షాప్‌ ఫెడరేషన్‌ తరఫున వినతిపత్రం అందజేశారు. ఇటీవల రేషన్‌ డీలర్లు వివిధ సమస్యలపై…

Read More

ఉరవకొండ బస్టాండ్‌లో వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభం

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (“దివ్యాంగ శక్తి” పథకం) నేపథ్యంలో, ఉరవకొండ బస్టాండ్‌లో బుధవారం టిడిపి నాయకులు ఉచిత ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్, ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవస్థానం చైర్మన్ రాయంపల్లి నాగరాజు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు,…

Read More