పట్టపగలే ఎర్ర మట్టి దందా… – Visalaandhra
‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?”…


