హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు…


