Unseasonal Rains: ఏపీలో అకాల వర్షాల బీభత్సం.. రూ. 63 కోట్లకు పైగా పంట నష్టం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు
పంటల వారీగా నష్టం వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రధానంగా వాణిజ్య, ఆహార పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,840 హెక్టార్లలో వరి, 1,534 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట నీటిపాలవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మిర్చి, పసుపు: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ. 1 లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు పెట్టుబడి…


