కాకినాడ బాణాసంచా ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి.
కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం మృతుల సంఖ్య 23 వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ఘటన స్థలాన్ని సందర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాణాసంచా తయారీ కేంద్ర యజమాని, అతని తండ్రి, తొమ్మిది మంది మహిళలు ఇందులో మరణించారని చెబుతున్నారు. ప్రమాదం…


