అన్నాడీఎంకేకు మరో దెబ్బ


ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామా
చెన్నై:
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐడీఎంకే ఎమ్మెల్యేల రాజానామా పరంపర కొనసాగుతోంది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నిబంధనలను పరిశీలించిన అనంతరం విజయభాస్కర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో ఏఐఏడీఎంకే బలం 41కు పడిపోయింది. రెండు వారాల క్రితం నలుగురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి అధికార టీవీకేలో చేరారు. తాజాగా విజయ్ భాస్కర్ అదే బాటలో నడిచారు. ఆయన అధికార టీవీకేలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. జయలలిత మంత్రివర్గంలో విజయభాస్కర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2021 ఎన్నికలలో కరూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. విజయభాస్కర్ రాజీనామాతో తమిళనాడులో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిల్లో విజయ్ వదులుకున్న తిరుచ్చి స్థానం కూడా ఒకటి. ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.

The post అన్నాడీఎంకేకు మరో దెబ్బ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *