ఆ వ్యాఖ్యలు కార్తికేయపై కాదు


పరువు నష్టం కేసులో విచారం వ్యక్తం చేసిన రాహుల్
న్యూదిల్లీ:
తనపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీ స్పందించారు. కార్తికేయపై చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో మరో దరఖాస్తు దాఖలు చేశారు. తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించినవి కావన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రమోద్ కుమార్ అగర్వాల్ విచారణ చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ 2018 జాభువాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పనామా పేపర్ లింక్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ…కార్తికేయ సింగ్ ప్రస్తావన తెచ్చారు. దీనితో కార్తికేయ భోపాల్‌లో ఎమ్మెల్యే-ఎంపీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల తన పరువు దెబ్బతిందని ఆరోపించారు. దీంతో, విచారణకు హాజరు కావాలంటూ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అయితే, రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లతో పాటు తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ తాజాగా మరో దరఖాస్తు దాఖలు చేశారు.

The post ఆ వ్యాఖ్యలు కార్తికేయపై కాదు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *