పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు – Visalaandhra


సవరించిన ఫీజులు జులై 1 నుంచి అమలు
న్యూదిల్లీ:
కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులు పెంచింది. 36 పేజీలతో కూడిన పాస్‌పోర్ట్ రుసుమును రూ.1500 నుంచి రూ.2,500లు చేసింది. తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు ప్రస్తుతం రూ.2వేలు వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.3,500 వసూలు చేయనున్నారు. తత్కాల్ ఫీజు రూ.6వేలుగా నిర్ణయించారు. 18ఏళ్ల కన్నా తక్కువ వయసున్న దరఖాస్తుదారులకు కొత్త పాస్‌పోర్ట్ రుసుము ప్రస్తుతం రూ.1000 ఉండగా…దీనిని రూ.1,750కి పెంచారు. సవరించిన ఫీజులు జులై 1 నుంచి అమలులోకి రానున్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. పాస్‌పోర్ట్ పౌరసత్వాన్ని నిర్థారించే పత్రం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు స్పందించారు. దేశంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్) ప్రక్రియలో చెల్లుబాటయ్యే 12 గుర్తింపు పత్రాల్లో పాస్‌పోర్ట్ కూడా ఒకటని స్పష్టం చేశారు. ఇటీవల బీహార్, అసోం రాష్ట్రాల్లో చేపట్టిన ఎసఐఆర్ ప్రక్రియలోనూ పాస్‌పోర్టు ఓ గుర్తింపు పత్రంగా ఉందని, అందులో ఎటువంటి మార్పు లేదని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *